ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

క్రీడా మైదానాలు ‘కార్యక్రమాల’ వేదికలు కాకూడదు..

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. అయితే, ఆ ప్రోత్సాహం కేవలం నిధుల రూపంలోనే కాకుండా.. క్రీడాకారులు ఆడే మైదానాలను కూడా గౌరవించేలా ఉండాలి.

మార్చి 30 (మహాప్రభ) : క్రీడలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం ఉంది. అయితే, ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికల్లో రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు క్రీడాకారులను, క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నిర్వాహకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మైదానం.. క్రీడాకారులకు దేవాలయం..

ఒక అథ్లెట్ లేదా విద్యార్థి గెలుపు కోసం.. క్రీడాకారులు ఏళ్ల తరబడి ఆ మైదానంలోనే చెమటోడుస్తారు. ఆ ‘ప్లేయింగ్ ఏరియా’ లేదా ‘ప్రాక్టీస్ టర్ఫ్’ వారికి అత్యంత పవిత్రమైనది. అయితే ఆ మైదానాల్లో స్టేజీలు వేయడం, భారీ వాహనాలు తిప్పడం వల్ల ఆ ట్రాక్స్ లేదా టర్ఫ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇది క్రీడాకారుల శిక్షణ, భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తుంది. ఇదే అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!