క్రీడా మైదానాలు ‘కార్యక్రమాల’ వేదికలు కాకూడదు..

తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయం. అయితే, ఆ ప్రోత్సాహం కేవలం నిధుల రూపంలోనే కాకుండా.. క్రీడాకారులు ఆడే మైదానాలను కూడా గౌరవించేలా ఉండాలి. మార్చి 30 (మహాప్రభ) : క్రీడలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం ఉంది. అయితే, ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికల్లో రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు క్రీడాకారులను, క్రీడాభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, నిర్వాహకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైదానం.. క్రీడాకారులకు దేవాలయం.. ఒక...