ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంకశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ బుధవారంనాడు తీర్పు వెలువరించారు.

న్యూఢిల్లీ మార్చి 24 మహాప్రభ : కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీ (Asiya Andrabi)కి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ మంగళవారంనాడు తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఇద్దరు సహ నిందితులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌లకు కోర్టు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.దేశానికి వ్యతిరేకంగా జనాలను రెచ్చగొడుతున్నారని, యుద్ధానికి ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై కేంద్ర హోం శాఖ ఆదేశాలతో 2018 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో అసియా అంద్రాబీని ‘ఉపా’ చట్టం కింద అరెస్టు చేశారు. ఆమెతో కలిసి పనిచేస్తున్న అనుచరులు సోఫీ ఫమీదా, నహిదా నస్రీన్‌పై 2021లో కేసు నమోదైంది. ఈ ముగ్గురుని జనవరి 14న కోర్టు ముందు హాజరుపరచగా, ఉపా చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద వీరిని దోషులుగా కోర్టు గుర్తించింది.
విచారణ సందర్భంగా అంద్రాబీకి కఠిన శిక్ష విధించాలని ఎన్ఐఏ వాదన వినిపించింది. ఆమె చర్యలు దేశంగా యుద్ధం ప్రకటించినట్టుగా ఉన్నాయని, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి బెదిరింపు చర్యలపై కఠిన చర్చలు తీసుకోవడం ద్వారా గట్టి సందేశం ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు తాజా తీర్పు ఇచ్చిది.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!