ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!

బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!

📰 Generate e-Paper Clip

బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 18 మహాప్రభ : బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ కేటగిరీలోనే ఉండేవారు. వారికి ఏడాదికి రూ.7 కోట్లను బోర్డు పారితోషికంగా చెల్లించేది. అయితే ఏ ప్లస్ కేటగిరీని తొలగించడంతో బుమ్రా ఏ కేటగిరీకి వచ్చాడు. దీనికి రూ.5 కోట్లు మాత్రమే బోర్డు చెల్లించనుంది. దీంతో అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా దాదాపు రూ.2 కోట్లను కోల్పోతున్నాడు.

బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అతడు నష్టపోతున్న రూ.2కోట్లను పరిహారంగా కింద బీసీసీఐ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు మరికొందరు ఆటగాళ్ల ప్రదర్శనను కూడా దృష్టిలో పెట్టుకుని వారి కాంట్రాక్టు మొత్తాలను కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టీమిండియా టీ20 ఫార్మాట్ వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా బీసీసీఐ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్షర్ ప్రస్తుతం గ్రేడ్ సిలో ఉన్నాడు. అతడు కేవలం రూ.కోటి మాత్రం అందుకుంటున్నాడు.అయితే గతంలో ఏ ప్లస్ కేటగిరీ దక్కించుకోవాలంటే క్రికెటర్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూ, కనీసం ఒక్క ఫార్మాట్లో అయినా టాప్ 10 ర్యాంకింగ్‌లో ఉండాలనే నిబంధన ఉండేది. విరాట్, రోహిత్ శర్మ టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు బీ కేటగిరీలో ఉన్నారు. కాగా ఏ కేటగిరీలో శుభ్‌మన్ గిల్, జడేజా, బుమ్రా కొనసాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!