యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్టకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
యాదాద్రి, మార్చి12 మహాప్రభ : యాదగిరిగుట్టలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం కోసం గురువారం ఉదయం యాదగిరిగుట్టకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఆ తర్వాత వారికి ఆలయ ఈవో భవానీ శంకర్ స్వామివారి జ్ఞాపికతోపాటు ప్రసాదాన్ని అందజేశారు. గవర్నర్ రాక సందర్భంగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌గా ప్రతాప్ శుక్లా చేత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
