ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిస్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

స్త్రీ శక్తితో తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

📰 Generate e-Paper Clip

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. అందులో ఒక్కటి స్త్రీ శక్తి పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించారు.

అమరావతి, మార్చి 03 మహాప్రభ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను దశల వారీగా ప్రవేశపెట్టి.. అమలు చేస్తోంది. అందులో ఒక్కటి స్త్రీ శక్తి పథకం. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించారు. ఈ పథకంతో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతున్నాయి.ఈ మేరకు ప్రకాశం జిల్లా పోలీసుల అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షను వర్చువల్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య జిల్లాలో గణనీయంగా తగ్గిందంటూ సీఎం చంద్రబాబు దృష్టికి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు తీసుకెళ్లారు.స్త్రీ శక్తి పథకం అమలుకు ఆరు నెలల ముందు, తర్వాత పోల్చుకుంటే..19 శాతం మేర మరణాలు తగ్గినట్టు ఈ జిల్లా పోలీసులు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా అధ్యయనం చేయించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో10 శాతం మేర మరణాలు తగ్గినట్టు నివేదికలో వెల్లడించారు. దాంతో రోడ్డు ప్రమాదాలపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేయాలంటూ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!