ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టండి... మోదీకి కేజ్రీవాల్ సవాల్ ABN , Publish Date -...

ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టండి… మోదీకి కేజ్రీవాల్ సవాల్ ABN , Publish Date – Feb 27 , 2026 | 05:19 PM

📰 Generate e-Paper Clip

ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కో సహా 23 మంది నిందితులను ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించిన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు.

న్యూఢిల్లీ , ఫిబ్రవరి 27 మహాప్రభ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని నాశనం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారని, ఇప్పుడు దేశానికి వారు క్షమాపణ చెప్పాలని ఆప్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ సహా 23 మంది నిందితులకు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించిన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికల జరపాలని మోదీకి సవాలు విసిరారు.

‘ఏళ్ల తరబడి నేను నిజాయితీని కూడబెట్టుకున్నాను, డబ్బులు కాదు. అవినీతి, అవకతవకలకు పాల్పడలేదు. సీఐబీ, ఈడీ నాపై దాడి చేశాయి. ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. ఇవాళ కోర్టు 600 పేజీల తీర్పులో ఈ కేసులో చిన్న సాక్ష్యం కూడా లేదని తేల్చిచెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయడానికి ఇద్దరు వ్యక్తులు… మోదీ, అమిత్‌షా కుట్ర పన్నారు. ఇవాళ ఆ ఇద్దరూ దేశానికి క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు.

ఎన్నికలకు సిద్ధమా?

ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిపాలని, ఇందుకు మోదీ సిద్ధమేనా అని కేజ్రీవాల్ సవాలు విసిరారు. ఎన్నికల్లో 10 సీట్లకు మించి వాళ్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ సహా పార్టీ నేతలు రోడ్‌షో నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!