ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్టీ20 ప్రపంచ కప్: షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 177

టీ20 ప్రపంచ కప్: షెఫర్డ్ హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ 177

📰 Generate e-Paper Clip

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 26 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికాకు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రొమారియో షెఫర్డ్(52*; 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జాసన్ హోల్డర్(49; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో అర్ధ శతకం మిస్ చేసుకున్నాడు.ఒకానొక దశలో సఫారీ బౌలర్ల ధాటికి 86 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. కింగ్(21), హోప్(16), హిట్ మేయర్(2), పావెల్(9), రోస్టన్(2), రుథర్‌ఫార్డ్(12), మాథ్యూ(11) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. 7 వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులో వచ్చిన షెఫర్డ్, హోల్డర్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. సఫారీ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుపడ్డారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. కాగా సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3, బోష్, రబాడ తలో 2 వికెట్లు పడగొట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!