ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిమద్యం స్కాంలో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

మద్యం స్కాంలో అవినాశ్ రెడ్డికి చుక్కెదురు

📰 Generate e-Paper Clip

ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు.

అమరావతి, ఫిబ్రవరి 24 మహాప్రభ : ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ 7గా ఉన్న ముప్పిడి అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మంగళవారం ముందస్తు బెయిల్ కోసం ముప్పిడి అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అతడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాకుండా.. ఫిబ్రవరి 26వ తేదీన విచారణాధికారి ఎదుట లొంగిపోవాలని అతడికి షరతు విధిస్తూ ఆదేశించింది.ఆ తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలంటూ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కాం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ముప్పిడి అవినాశ్ రెడ్డి ..శ్రీలంకలో తలదాచుకున్నారు. ఈ లిక్కర్ స్కాం కేసులో దోచిన నగదును ముప్పిడి అవినాశ్ రెడ్డి ద్వారా రాజ్ కసిరెడ్డి విదేశాల్లో దాచారంటూ.. అందుకు సంబంధించిన అనుమానాలు బలంగా ఉన్నాయంటూ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే అభిప్రాయపడింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!