ePaper
Tuesday, August 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణదారుణం: కన్న బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి

దారుణం: కన్న బిడ్డను కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన తల్లి

📰 Generate e-Paper Clip

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 24 మహాప్రభ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల బాలుడిని కన్న తల్లి(Mother Attacked Son) అత్యంత దారుణంగా హత్య చేసింది. బాలుడిని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరి హత్య చేసింది. బౌరంపేట్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది. ఈ ఘటనపై స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దుండిగల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు (Police Investigation) చేస్తున్నారు. నవమోసాలు మోసిన బిడ్డను అతి దారుణంగా చంపడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు పసిబిడ్డను చంపడానికి ఆమెకు మనస్సు ఎలా వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తల్లి ఇలా ఎందుకు చేసిందో తెలియాల్సి ఉంది. అలానే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!