ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్యూపీలో దారుణం: భార్యపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన భర్త.. చివరకు..

యూపీలో దారుణం: భార్యపై మూడు రౌండ్ల కాల్పులు జరిపిన భర్త.. చివరకు..

📰 Generate e-Paper Clip

ఇటీవలే ఓ వ్యక్తి తన మాజీ భార్యను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. తనకు దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు..

యూపీ, ఫిబ్రవరి 21 మహాప్రభ : ఒకప్పుడు తమ మధ్య ఎన్ని గొడవలు జరిగినా భార్యాభర్తలు సర్దుకుపోతూ సంసారం అనే బండిని నడిపేవారు. అయితే నేటి కాలంలో చాలా మంది భాగస్వామితో గొడవలు జరగ్గానే.. సంసారం అనే బండిని దిగేస్తున్నారు. మరికొందరు అయితే ఏకంగా తమ భాగస్వామిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవలే తన మాజీ భార్యను ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తన నుంచి దూరంగా ఉంటున్న భార్యను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫరీదాబాద్‌ ప్రాంతానికి చెందిన సంగీతా దేవి(30) అనే మహిళ.. తన పుట్టింటి వారితో కలిసి నివాసం ఉంటోంది. గొడవ కారణంగా భర్త నుంచి ఆమె దూరంగా ఉంటోంది. ఈ జంట విడాకుల కేసు (Divorce Case) ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 8.00 గంటల సమయంలో సంగీత ఇంటికి.. బీహార్‌కు చెందిన ఆమె భర్త, అత్తమామలు వెళ్లారు. అయితే ఆ సమయంలో సంగీత ఇంట్లో లేదని స్థానికులు తెలిపారు. అప్పుడే సంగీత వీధిలో నడుచుకుంటూ తన ఇంటికి వస్తోంది. సంగీతను ఆమె భర్త వీధిలోనే అడ్డగించాడు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రమైంది.

భర్త దాడి చేసే సమయంలో.. సంగీత తనను తాను రక్షించుకోవడానికి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే సంగీత భర్త ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. రెండు బుల్లెట్లు తగలడంతో.. సంగీత రోడ్డుపై కుప్పకూలిపోయింది. కాల్పుల శబ్దం విన్న పొరుగువారు తమ ఇళ్ల నుంచి బయటకు రాగా.. సంగీత భర్తతో పాటూ బంధువులంతా అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సంగీతను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!