ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ..

ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు ..

📰 Generate e-Paper Clip

మాజీ సీఎం జగన్ అక్రమస్తుల కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

 ఫిబ్రవరి 17 మహాప్రభ, ఆంధ్రప్రదేశ్ : మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసు(illegal assets case)లో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ రిజెక్ట్ చేసింది.

ఓబులాపురం గనుల కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లానని ఐఏఎస్ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే శ్రీలక్ష్మి(IAS Srilakshmi) నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ,ఆమె మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. ఆమె లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్ష్యాలు వాంగ్మూలం ఇచ్చారని సుప్రీం ధర్మాసనానికి సీబీఐ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!