ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజనగామకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ముందు ఇండిపెండెంట్ ‘డిమాండ్’

📰 Generate e-Paper Clip

జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

జనగామ, ఫిబ్రవరి 13 మహాప్రభ : తెలంగాణలోని జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫలితాలు సమానంగా రావడంతో, స్వతంత్ర అభ్యర్థి మారబోయిన పాండు మద్దతు కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఇరు పార్టీల నాయకులు స్వతంత్ర అభ్యర్థి పాండును తమ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి.వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని.. పరిస్థితి దిగజారకుండా ఇరు పక్షాలను చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. అయితే స్వతంత్ర అభ్యర్థి చేసిన డిమాండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు ఛైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతిస్తానంటూ పాండు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి డిమాండ్‌పై బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!