ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పేరు మార్పుతో నష్టం లేదు.. : Mahaaprabha

పేరు మార్పుతో నష్టం లేదు.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌
  • వీబీజీరాంజీపై అవగాహన సదస్సు

అనంతపురం, ఫిబ్రవరి 7 మహాప్రభ : ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వల్ల గతంలో రాజకీయ నాయకులు, వారి అనుచరులే లబ్ధి పొందారన్నారు. అందుకే లోపాలను సవరించి గ్రామాలను అభివృద్ధి చేయడానికి పథకం పేరు మార్చినట్లు తెలిపారు.దేశంలో గాంధీవారసులు లేకున్నా ఆయన పేరు పెట్టుకుని కొందరు చెలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళల బాధను అర్థం చేసుకున్న ప్రధాని మోదీ దేశంలో 12 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు ప్రజలు మరచిపోలేదన్నారు. కొంత మంది కేటుగాళ్లు అధికారంలో ఉండి కూడా ఏ అభివృద్ధి చేయకుండా, వారు మాత్రమే అభివృద్ధి చెందారని వి మర్శించారు.అంతకు మునుపు ఉమ్మడి జిల్లాలోని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు మంత్రి సత్యకుమార్‌ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. స్పందించిన మంత్రి సమస్యను సీఎం, డీసీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. విద్యార్థులకు బీజేపీ నాయకులు కేతిరెడ్డి దివాకర్‌రెడ్డి క్రికెట్‌ కిట్లు మంత్రి సత్యకుమార్‌ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకులు వీరనారప్ప, నారాయణరెడ్డి, వెంకటేశ్వరెడ్డి, వెంకటచౌదరి, రమణ, చల్లాశ్రీనివాసులు, నారాయణస్వామి, సురేంద్ర పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!