ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homebusinessభారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే.. : Mahaaprabha

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు ఎంతంటే.. : Mahaaprabha

📰 Generate e-Paper Clip

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చింది. ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అలానే వెండి ధర కూడా పెరిగింది. ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉందంటే…

బిజినెస్ న్యూస్ ఫిబ్రవరి 7 మహాప్రభ : భారతీయులకు బంగారం(Gold) అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళలకు పసిడి అంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలో బంగారం ధరలకు సంబంధించిన అప్ డేట్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటీవల స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్లు.. ఇవాళ భారీగా పెరిగాయి. దీంతో మరోసారి ఈ రెండు లోహాల ధరలు నింగి వైపు చూస్తున్నాయి (Gold prices Live).ఇవాళ (ఫిబ్రవరి 7న) ఉదయం 11:00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,56,600కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 2890 రూపాయలు పెరిగింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550కి చేరింది (live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,650 రూపాయలు పెరిగింది. అలానే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,450కి చేరింది. నిన్నటి ధరతో పోలిస్తే.. రూ.2,170 రూపాయలు పెరిగింది.ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,56,750కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,43,700కి చేరుకుంది. ఇక, వెండి కూడా స్వల్పంగా పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.5,000 మేర పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,85,000 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర రూ. 2,85,000 లక్షలుగా ఉంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!