ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంతీర్పుల్లో జాప్యం ఓ రుగ్మత : Mahaaprabha

తీర్పుల్లో జాప్యం ఓ రుగ్మత : Mahaaprabha

📰 Generate e-Paper Clip

హైకోర్టులో వాదనలన్నీ విన్న తరువాత జడ్జీలు తీర్పులను నెలల తరబడి వాయిదా వేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది…

  •  వాదనలు పూర్తయ్యాక వాయిదాలా?
  • సుప్రీంకోర్టు అసంతృప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 మహాప్రభ –: హైకోర్టులో వాదనలన్నీ విన్న తరువాత జడ్జీలు తీర్పులను నెలల తరబడి వాయిదా వేస్తుండడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీన్ని ‘గుర్తించదగ్గ రుగ్మత’గా అభివర్ణించింది. ఝార్ఖండ్‌ హైకోర్టు డిసెంబరు నాలుగో తేదీన ఓ రిట్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసినా అందుకు సంబంధించిన తీర్పును మాత్రం ఇంతవరకు వెలువరించలేదు. దీనిపై దాఖలైన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీజేఐ స్పందిస్తూ ‘జడ్జీల్లో కొందరు తీవ్రంగా శ్రమించి 10-15 కేసులపై విచారణ జరుపుతారు. తీర్పులను వాయిదా వేస్తారు. ఇంకొందరు విచారణ జరిపినా తీర్పులు మాత్రం ఇవ్వరు. మరికొందరు ఉంటారు…వాదనలు పూర్తి చేసినా తదుపరి విచారణ ఉందంటూ కేసును వాయిదా వేస్తారు. ఇది గుర్తించదగ్గ రుగ్మత. న్యాయ వ్యవస్థకు సవాలులాంటిది. దీన్ని అరికట్టాల్సి ఉంది. ఈ సమస్యపై త్వరలో జరగనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో వచ్చే వారం చివరిలోగా తీర్పును వెల్లడించాలని ఆదేశించారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!