ePaper
Tuesday, April 14, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

📰 Generate e-Paper Clip

కొంతమంది మతమార్పిడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. మత మార్పిడి జరిగితే 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి ఏప్రిల్ 13 (మహాప్రభ) : కొంతమంది మతమార్పిడి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. మత మార్పిడి జరిగితే 5 ఏళ్లు జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. సోమవారం మత మార్పిళ్లపై రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు క్లియర్‌గా చెప్పింది.. ఆర్టికల్ 25 మతం మారే స్వేచ్ఛ ఇచ్చింది. మతతత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. దయచేసి ‌హిందూ దళిత సోదరులను మోసం చేయకండి. క్రిస్టియన్‌లకు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే హక్కు లేదు’ అని అన్నారు.

కాగా, గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేటలో శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన రఘురామకృష్ణరాజుతో పాటు జనసేన నాయకులపైనా కత్తులు, మేకులతో ఆందోళనకారులు దాడి చేశారు. దళితుల ముసుగులో క్రైస్తవులు తమపై దాడికి దిగారని రఘురామ ఆరోపించారు. అన్య మతస్థులు అనుమతిస్తేనే గానీ శ్రీరాముడి దేవాలయానికి వెళ్లి దండ వేయలేని దుస్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

800 ఏళ్లు చెక్కుచెదరకుండా రామాలయ నిర్మాణం..

మార్చి 29వ తేదీన రఘురామకృష్ణరాజు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో.. ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు, ఆగమ శాస్త్రం ప్రకారం.. పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము’ అని రాసుకొచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!