ePaper
Monday, October 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిసీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపై ప్రముఖుల సంతాపం

సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపై ప్రముఖుల సంతాపం

📰 Generate e-Paper Clip

రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అమరావతి మే 2 ( మహాప్రభ ) : సీసీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతిపట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతాపం తెలియజేశారు. గౌరమ్మ మరణవార్త తెలిసిన వెంటనే రామకృష్ణను ఫోన్లో పరామర్శించారు సీఎం చంద్రబాబు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డిప్యూటీ సీఎం పవన్ సంతాపం

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గౌరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులకు పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రామకృష్ణకు నా ప్రగాఢ సానుభూతి: మంత్రి లోకేశ్

‘మీ మాతృమూర్తి గౌరమ్మ స్వర్గస్తులయ్యారనే వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నూరేళ్ల పరిపూర్ణ జీవితాన్ని గడిపి, క్రమశిక్షణ కలిగిన మిమ్మల్ని సమాజానికి అందించిన ఆమె మరణం మీ కుటుంబానికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఈ కష్ట సమయంలో మీకు, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.

సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ రఘువీరారెడ్డి తదితరులు.. రామకృష్ణను పరామర్శించి, సంతాపం తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!