రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి సీనియర్ నేతలు పలువురు హాజరయ్యారు.
న్యూఢిల్లీ ఏప్రిల్ 16 (మహాప్రభ) : రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. అలాగే వేం నరేందర్ రెడ్డి, అభిషేక మను సింఘ్వీలు కూడా ఈ రోజే రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వేం నరేంద్ర రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
