ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeమోదీ చెప్పినవి ప్రబోధాలు కావు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు: రాహుల్మోదీ చెప్పినవి ప్రబోధాలు కావు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు: రాహుల్

మోదీ చెప్పినవి ప్రబోధాలు కావు.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు: రాహుల్

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు.

ఇంటర్‌నెట్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోదీ జవాబుదారీతనాన్ని కోల్పోయారని అన్నారు. ప్రజలు ఏం కొనాలో.. ఏం కొనకూడదో చెప్పే పరిస్థితికి మోదీ వచ్చారంటూ మండిపడ్డారు. తెలంగాణ సభలో మోదీ చెప్పినవి ప్రబోధాలు కావని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అని అన్నారు. రాజీపడిన ప్రధాని మోదీ.. దేశాన్ని నడపడం కష్టమన్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో సోమవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ప్రతిసారీ బాధ్యతను ప్రజలపైనే నెట్టేస్తున్నారని, ఆయన మాత్రం జవాబుదారీతనం నుంచి తప్పించుకుతిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ మోదీ ఏమన్నారంటే..

ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు. రెండు నెలల నుంచి ప్రజలపై భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, యుద్ధం కారణంగా వచ్చే నష్టాన్ని కేంద్రమే భరిస్తోందని వెల్లడించారు. క్లిష్ట సమయంలో దేశ ప్రజలు పెట్రోల్, డీజిల్ పరిమితంగా వినియోగించాలని కోరారు. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని.. వర్క్‌ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా రవాణాను వినియోగించాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!