ePaper
Saturday, July 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeకేదార్‌నాథ్ దేవాలయంతెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

📰 Generate e-Paper Clip

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.

డెహ్రాడూన్ ఏప్రిల్ 24 (మహాప్రభ) : చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఒకానొక దశలో భక్తులను కట్టడి చేయడం ఆలయ సిబ్బందికి కష్టతరంగా మారింది. మరో వైపు స్వామి వారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు నిబంధనలు అతిక్రమిస్తూ.. ఒక క్యూ లైన్ నుంచి మరో క్యూ లైన్‌లోకి చొరబడుతున్నారు. దాంతో వారి మధ్య ఘర్షణ, వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఆరు నెలల తర్వాత.. ఏప్రిల్ 22వ తేదీన ఈ కేదార్‌నాథ్ దేవాలయం తెరుచుకుంది. మరో ఆరు నెలల పాటు ఈ దేవాలయం తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది నవంబర్‌ 11వ తేదీన ఈ దేవాలయాన్ని మూసివేస్తారు. శీతాకాలం ఈ ప్రాంతంలో భారీగా చలిగాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో ఆరు నెలల పాటు ఈ దేవాలయాన్ని మూసివేయనున్నారు.

ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల్లో ఏప్రిల్ 19వ తేదీన చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తర కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఏప్రిల్ 22న రుద్రప్రయాగ్‌లోని కేదార్‌నాథ్, ఏప్రిల్ 23వ తేదీన చమోలీలోని బద్రీనాథ్ ఆలయాలను తెరిచారు. ఈ చార్‌ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!