ePaper
Friday, April 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంచైనా రెస్టారెంట్‌లో ఏఐ రోబోలు.. మీ నాలుక చూసి మీరేం తినాలో చెబుతాయి..

చైనా రెస్టారెంట్‌లో ఏఐ రోబోలు.. మీ నాలుక చూసి మీరేం తినాలో చెబుతాయి..

📰 Generate e-Paper Clip

చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్‌జౌ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి.

ఏప్రిల్ 16 (మహాప్రభ) :చైనాలో టెక్నాలజీ మరో కొత్త దశలోకి ప్రవేశించింది. అక్కడి హాంగ్‌జౌ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో పని చేసే రోబో వెయిటర్లు మీరేం తినాలో చెబుతాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో పని చేసే ఆ రోబో వెయిటర్లు కస్టమర్ల మొహం, నాలుకను స్కాన్ చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో సూచిస్తాయి. ఈ వినూత్న టెక్నాలజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (AI robot waiter China).

రెస్టారెంట్‌లోకి ఓ కస్టమర్ ప్రవేశించగానే.. రోబో వెయిటర్ అతడి మొహం, నాలుకను స్కాన్ చేస్తుంది. కొన్ని ప్రశ్నలు అడిగి డేటా సేకరించి దానిని ఏఐ ద్వారా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత కస్టమర్ ఆరోగ్యం, జీర్ణశక్తి, మూడ్ ఆధారంగా సరైన డిష్‌ను సూచిస్తుంది. ఆ రెస్టారెంట్‌లో సుమారు 8 రోబోలు పనిచేస్తున్నాయి. అవి ఆర్డర్ తీసుకోవడం, వంట చేయడం, సర్వింగ్, క్లీనింగ్‌తో వంటి చాలా పనులు చేస్తున్నాయి (Robot restaurant Hangzhou). అంతే కాదు ఆ రోబోలు వందకు పైగా వంటకాలను స్వయంగా తయారు చేయగలవు (AI food recommendation system). ఆ రెస్టారెంట్‌లోని మొత్తం పని భారంలో దాదాపు 60% ఈ రోబోలే చేస్తున్నాయి. ఈ ఏఐ రోబోలు కేవలం వెయిటర్లలా మాత్రమే కాకుండా.. డిజిటల్ న్యూట్రిషనిస్ట్‌ల్లా పని చేస్తున్నాయి. ఏదేమైనా ఈ ఏఐ రోబోలు భవిష్యత్తులో ఫుడ్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఏఐ టెక్నాలజీ ఇప్పుడు మన ప్లేట్ వరకు వచ్చేసింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!