ePaper
Tuesday, August 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజనగామకాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తే చెప్పులతో కొడతారు

కాళేశ్వరంపై అసత్య ప్రచారం చేస్తే చెప్పులతో కొడతారు

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

చేర్యాల(సిద్దిపేట) ఏప్రిల్ 24 (మహాప్రభ) : కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. గురువారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, అది తెలంగాణ ప్రాంత వరప్రదాయిని అని పేర్కొన్నారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ పీసీసీ కమిషన్‌గా మారిందని విమర్శించిన ఆయన,

 

హైకోర్టు తీర్పు అందుకు నిదర్శనమన్నారు. అనంతరం వివిధ మండలాల లబ్ధిదారులకు రూ.13.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ముస్త్యాల అరుణ, వైస్‌ చైర్మన్‌ ఉమ, బీఆర్‌ఎస్‌ నేతలు అనంతుల మల్లేశం, మేక సంతోష్‌, మంద యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!