ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఅసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

📰 Generate e-Paper Clip

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ అధిక్యంలో ఉండడం, తమిళనాడులో కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో మార్కెట్లపై సానుకూల ప్రభావం కనబడుతోంది. బెంగాల్‌లో బీజేపీ ప్రస్తుతానికి మెజారిటీ మార్క్‌కు పైనే ఆధిక్యంలో ఉంది. దీంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.

మే 4 ( మహాప్రభ ) :పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ అధిక్యంలో ఉండడం, తమిళనాడులో కూడా గట్టి పోటీ ఇస్తుండడంతో మార్కెట్లపై సానుకూల ప్రభావం కనబడుతోంది. బెంగాల్‌లో బీజేపీ ప్రస్తుతానికి మెజారిటీ మార్క్‌కు పైనే ఆధిక్యంలో ఉంది. దీంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ ఒక శాతానికి పైగా లాభపడింది. దాదాపు అన్ని రంగాలూ లాభాల బాటలోనే సాగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలపడింది (Indian stock market).

గత సెషన్ ముగింపు (76,913)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం 300 పాయింట్లకు పైగా లాభంతో 77,257 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 800 పాయింట్ల లాభంతో 77,714 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 240 పాయింట్ల లాభంతో 24,238 వద్ద కదలాడుతోంది. మళ్లీ 24 వేల మార్క్ ఎగువకు చేరుకుంది (stock market news today).

సెన్సెక్స్‌, నిఫ్టీలో వేదాంత, హెచ్‌యూఎల్, మారుతీ సుజుకీ, వోడాఫోన్ ఐడియా, బజాజ్ ఆటో మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). మాజగాన్ డాక్, అవెన్యూ సూపర్ మార్కెట్, సోనా బీఎల్‌డబ్ల్యూ, కొటక్ మహీంద్రా, ఐనాక్స్ విండ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 555 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.84గా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!