ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఅణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపే వరకు దిగ్బంధనం కొనసాగుతుంది.. ఇరాన్‌కు అమెరికా మంత్రి వార్నింగ్..

అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపే వరకు దిగ్బంధనం కొనసాగుతుంది.. ఇరాన్‌కు అమెరికా మంత్రి వార్నింగ్..

📰 Generate e-Paper Clip

అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనే ఆశలను పూర్తిగా వదులుకునేవరకు ఇరాన్ పోర్ట్‌లపై, నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈ దిగ్బంధనాన్ని ఇనుప కవచంగా పేర్కొన్న హెగ్సెత్, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు.

ఏప్రిల్ 25 (మహాప్రభ) : అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనే ఆశలను పూర్తిగా వదులుకునేవరకు ఇరాన్ పోర్ట్‌లపై, నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈ దిగ్బంధనాన్ని ఇనుప కవచంగా పేర్కొన్న హెగ్సెత్, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు. ఇరాన్ వెనక్కి తగ్గకపోతే దిగ్బంధనాన్ని శాశ్వతంగా విధిస్తామన్నారు (Hegseth Hormuz blockade).

అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును తొలిగించడానికే తాము ఈ సాహసోపేతమైన, ప్రమాదకరమైన మిషన్‌ను చేపట్టామని హెగ్సెత్ స్పష్టం చేశారు. తమ అనుమతి లేకుండా హోర్ముజ్‌లోకి ఏ రవాణా నౌకా రాదని, బయటకు వెళ్లదని అన్నారు. జలసంధిలోని నౌకలపై దాడులు చేస్తూ.. ఇరాన్ ఓ సముద్రపు దొంగల ముఠాల వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడేందుకు అమెరికా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటుందని తేల్చి చెప్పారు (Iran nuclear crisis 2026).

అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది (US Iran war news). ఎందుకంటే ఆ దేశం ప్రధానంగా చమురు ఎగుమతులపై ఆధారపడుతుంది. ఎగుమతులు ఆగిపోవడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చలు జరపాలని ఇరాన్‌లోని ఒక వర్గం నాయకులు కోరుకుంటున్నారు. ఐఆర్‌జీసీ మాత్రం చర్చలకు దిగి రావడం లేదు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!