ప్రగతికి దారి చూపుతూ, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలందరికీ ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్ మే 11 ( మహాప్రభ ) : జాతీయ సాంకేతి దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రజా ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని సీఎం తెలిపారు.
రేవంత్ ట్వీట్..
‘ప్రగతికి దారి చూపుతూ, భవిష్యత్తు తరాలకు ప్రేరణనిస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలందరికీ ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ సందర్భంగా శుభాకాంక్షలు. సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, భవిష్యత్ సవాళ్లను అధిగమించడం కోసం టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతునిస్తుందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని భారత టెక్నాలజీ శక్తిని ప్రపంచానికి చాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు’ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
