ePaper
Sunday, October 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పని మనిషి..

దారుణం.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పని మనిషి..

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి సునంద (55) హత్యకు గురయ్యారు.

హైదరాబాద్ మే 8 ( మహాప్రభ ) : జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ సతీమణి సునంద (55) హత్యకు గురయ్యారు. రిటైర్డ్ ఏపీఎస్ భార్యను పని మనిషి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సునందను గొంతు నులిమి హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పని మనిషి పరారైనట్లు సమాచారం. కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగానే హత్య చేసినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ హత్యకు పాల్పడింది నేపాలీ గ్యాంగ్ అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు హత్య గురించి తెలిసిన వెంటనే విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్‌ ఇంటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకుని పరామర్శించారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!