ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeకరీంనగర్కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ట్విస్ట్

కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాప్ దోపిడీ కేసులో ట్విస్ట్

📰 Generate e-Paper Clip

కరీంనగర్ పీఎంజే బంగారం దుకాణం దోపిడీ చేసిన కేసులో దుండగులు వాడిన వాహనానికి హైదరాబాద్‌కు చెందిన మొబైల్ షాపు వ్యాపారి ద్విచక్ర వాహనం నంబర్ వాడినట్లు పోలీసులు గుర్తించారు.

కరీంనగర్ మే 7 ( మహాప్రభ ) : కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు దోపిడీ కేసులో ట్విస్ట్ బయటపడింది. దోపిడీ కోసం దుండగులు ఉపయోగించిన బైక్‌కు.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వాహనం నంబర్‌ వాడినట్లు విచారణలో బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన మొబైల్ షాపు వ్యాపారి ద్విచక్ర వాహనం నంబర్‌ను దుండగులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే సదరు వ్యాపారిని హైదరాబాద్, కరీంనగర్ పోలీసులు విచారించారు.

విచారణలో మొబైల్ వ్యాపారి అపాచీ బైక్ నంబర్‌ను దుండుగులు ఉపయోగించిన బైక్‌కు పెట్టుకుని పోలీసుల దృష్టి మళ్లించే ప్రయత్నం చేసినట్లు బయటపడింది. దీంతో ఆ నంబర్ దోపిడీ దొంగలకు ఎలా తెలిసిందనే దానిపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్‌కు చెందిన మొబైల్ వ్యాపారి ఇటీవల తన అపాచీ బైక్ అమ్మడానికి OLXలో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు OLX‌లో బైక్ నంబర్‌ను గుర్తు పెట్టుకుని ఆ నంబర్‌ను ఉపయోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!