ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్కృష్ణా జిల్లాలో దారుణం.. భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి చంపిన భర్త

కృష్ణా జిల్లాలో దారుణం.. భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి చంపిన భర్త

📰 Generate e-Paper Clip

కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో, భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

కృష్ణా జిల్లా మే 4 ( మహాప్రభ ) : కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్‌లో ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో.. భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఘటన వివరాలిలా..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు దిమ్మెట లక్ష్మీప్రసన్న (30). ఆమెకు 13 ఏళ్ల క్రితం మీర్జాపురం గ్రామానికి చెందిన మురళీకృష్ణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా లక్ష్మీప్రసన్న తన భర్త, పిల్లలను వదిలిపెట్టి నిడుమోలు గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. లక్ష్మీప్రసన్న వివాహేతర సంబంధం పెట్టుకుని దూరంగా ఉండటాన్ని భర్త మురళీకృష్ణ జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆమెను వదిలించుకోవాలని పథకం పన్నాడు. సోమవారం తెల్లవారుజామున గాంధీనగర్‌లో ఉన్న లక్ష్మీప్రసన్నపై మురళీకృష్ణ తన ఇద్దరు సోదరులతో కలిసి దాడికి దిగాడు.

పోలీసుల చర్యలు..

ఇనుపరాడ్‌తో ఆమె తలపై బలంగా కొట్టడంతో, తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే పామర్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సహకరించిన భర్త మురళీకృష్ణతో పాటు అతని ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. 13 ఏళ్ల వైవాహిక బంధం, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, వివాహేతర సంబంధాలు చివరకు ఇలాంటి విషాదాంతాలకు దారితీస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మీర్జాపురం, పామర్రు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!