ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..

రెయిన్ అలర్ట్.. మరో మూడు గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..

📰 Generate e-Paper Clip

రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వెల్లడించారు.

విశాఖ మే 1 ( మహాప్రభ ) : రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్ర సహా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడరాదని సూచించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!