ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంపెరిగిన కార్ల వినియోగం.. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం

పెరిగిన కార్ల వినియోగం.. ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రం

📰 Generate e-Paper Clip

రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ జంక్షన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వరకు, గెలాక్సీ బై ఆరో రియాల్టీ ప్రాంతాల్లో నిరంతరాయంగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఐటీ ఉద్యోగులు, టెక్ కంపెనీలు, షాపింగ్ మాల్స్ కారణంగా ఈ ప్రాంతాల్లో వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి.

హైదరాబాద్ ఏప్రిల్ 14 (మహాప్రభ) : భాగ్యనగరంలో వాహనాల వాడకం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు సామాన్యుడికి కారు అనేది ఓ కల అనే చెప్పుకోవాలి. ఇప్పుడా పరిస్థితి లేదు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం పెరగడం, సులభంగా బ్యాంక్ లోన్లు లభ్యం కావడం వంటి కారణాలతో సామాన్యుడు కూడా కారుకు సై అంటున్నాడు. ఫలితంగా నగరంలో ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌లైన రాయదుర్గం, ఖాజాగూడ, బయోడైవర్సిటీ జంక్షన్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నిత్యం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.

రాయుదర్గంలో ట్రాఫిక్ జామ్…

రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ జంక్షన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వరకు, గెలాక్సీ బై ఆరో రియాల్టీ ప్రాంతాల్లో నిరంతరాయంగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. ఐటీ ఉద్యోగులు, టెక్ కంపెనీలు, షాపింగ్ మాల్స్ కారణంగా ఈ ప్రాంతాల్లో వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. అటు.. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!