న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 11 (మహాప్రభ) : న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల ధాటికి స్కోర్ బోర్డు పట్టాపగ్గాల్లేకుండా పరుగులు పెట్టింది. అభిషేక్ శర్మ(74; 28 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎట్టకేలకు ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
మరోవైపు ట్రావిడ్ హెడ్(38; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తొలి వికెట్‌కు అభిషేక్, హెడ్ కలిసి 49 బంతుల్లో ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇషాన్ కిషన్(27), హెన్రిచ్ క్లాసెన్(39), అనికేత్ వర్మ(18), సలీల్ అరోరా(9) రాణించారు. నితీశ్ కుమార్ రెడ్డి(0*), హర్ష్ దూబె(1*) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, శశాంక్ సింగ్ 2, బార్ట్లెట్ 1 వికెట్ పడగొట్టారు.
