ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంనేను బంతినే చూస్తా.. బౌలర్‌ను కాదు: వైభవ్ సూర్యవంశీ

నేను బంతినే చూస్తా.. బౌలర్‌ను కాదు: వైభవ్ సూర్యవంశీ

📰 Generate e-Paper Clip

రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు.

ఏప్రిల్ 11 (మహాప్రభ) :రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసమాన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే మహా మహా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో వీరవిహారం చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో కూడా భారీ సిక్స్‌లు కొట్టాడు (Vaibhav Sooryavanshi).

తాజాగా తన ఆటతీరు గురించి వైభవ్ మాట్లాడాడు. ‘నేను బంతిని మాత్రమే చూసి ఆడతాను. బౌలర్‌ను కాదు. ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాను. నేను చివరి వరకు ఉండుంటే మరో 20 పరుగులు చేసేవాడిని. అది జట్టుకు మరింత ఉపయోగపడేది. మా నాన్న, కోచ్‌లు నిరంతరం నన్ను గైడ్ చేస్తూనే ఉంటారు. నా గార్డియన్ రోమి సర్. సుదీర్ఘ కెరీర్ కొనసాగించాలని ఆయన నాకు చెబుతూ ఉంటారు’ అని వైభవ్ పేర్కొన్నాడు (Vaibhav Sooryavanshi Innings).

పేలవమైన షాట్ ఆడి అవుటైనందుకు చాలా బాధగా ఉందని, మ్యాచ్ ముగిసేవరకు క్రీజులో ఉండలేకపోయినందుకు బాధపడ్డానని వైభవ్ చెప్పాడు (IPL 2026). కాగా, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం వైభవ్‌కు ఇది రెండోసారి. ఈ సీజన్‌లోనే గువాహటిలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ 15 బంతుల్లోనే అర్ధశతకం చేశాడు. కాగా, వైభవ్ కంటే ముందు యశస్వి జైస్వాల్ (13 బంతుల్లో), కేఎల్ రాహుల్ (14 బంతుల్లో) వేగంగా హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్లుగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!