ePaper
Wednesday, June 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Home60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

60 అడుగుల బోర్‌వెల్‌లో మూడేళ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ

📰 Generate e-Paper Clip

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లా ఝలారియా గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. వివరాల్లోకి వెళితే..

ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిన్ జిల్లా ఝలారియా గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది. భగీరథ్ అనే మూడేళ్ల బాలుడు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. గడిచిన 18 గంటలుగా బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాలుడు క్షేమంగా బయటకు రావాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు ప్రార్థనలు చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని పాలి జిల్లా గుండనాల గ్రామానికి చెందిన ప్రవీణ్ దేవసి కుమారుడు భగీరథ్. బాలుడి వయసు మూడేళ్లు. బాలుడి కుటుంబ సభ్యులు, గొర్రెల కాపరులతో కలిసి ఝలారియా గ్రామ పరిసరాల్లో గొర్రెలను మేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు, అక్కడ తెరిచి ఉన్న బోరు బావిని గమనించక అందులో పడిపోయాడు. తల్లిదండ్రులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించింది. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి బృందాలు నిరంతరం శ్రమిస్తుండటంతో, 18 గంటలకు పైగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాలుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగకుండా పైపుల ద్వారా నిరంతరం ఆక్సిజన్‌ను లోపలికి పంపిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలం వద్ద అంబులెన్స్, వైద్య నిపుణుల బృందాన్ని సిద్ధంగా ఉంచారు. మరికొన్ని గంటల్లోనే భగీరథ్‌ను సురక్షితంగా బయటకు తీస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!