ePaper
Monday, April 6, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeకారు ప్రమాదంవిజయవాడలో అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం

విజయవాడలో అగ్ని ప్రమాదం.. కారు దగ్ధం

📰 Generate e-Paper Clip

విజయవాడలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు.

విజయవాడ ఏప్రిల్ 6 (మహాప్రభ) : నగరంలోని కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ సమీపంలో రహదారిపై కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై..కారులో ప్రయాణిస్తున్న వారికి తెలిపారు. వారు వెంటనే కారు ఆపి అందులో నుంచి దిగిపోయారు. ఆ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు దగ్ధమైంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రద్దీ ప్రాంతమైన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు రంగ ప్రవేశం చేసి.. రహదారిపై నుంచి కారును పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!