ePaper
Wednesday, May 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిక్లారిటీ లేదు.. సీఐడీ విచారణపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

క్లారిటీ లేదు.. సీఐడీ విచారణపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

📰 Generate e-Paper Clip

ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో శనివారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఏప్రిల్ 4 (మహాప్రభ) : ఇటీవల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. తాజాగా పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో.. కౌశిక్ రెడ్డి శనివారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ప్రభుత్వం, పోలీసులపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా వేధించడానికి ఈ విచారణలు జరుపుతున్నారని ఆరోపించారు. సీఐడీ కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే నాపై ఎథిక్స్ కమిటీ వేశారు. ప్రజల పక్షాన పోరాడటానికి నేను దేనికైనా సిద్ధం. హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కరీంనగర్ జిల్లా చెత్తనంతా తెచ్చి హుజూరాబాద్‌లో వేస్తే ఊరుకోం. ఆ డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదం. ఈ విషయంలో నేను చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి విచారణ పేరుతో అడ్డుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీన హుజూరాబాద్‌లో దీక్షకు కూర్చుంటా. నేను మత మార్పిడిలపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా’ అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!