ePaper
Saturday, July 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

📰 Generate e-Paper Clip

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ కన్నుమూశారు.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 26 (మహాప్రభ) : సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సూపర్ మ్యాన్’ఫేం వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ (71) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కొల్లంలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రేపు త్రిస్సూర్‌లోని త్రితల్లూరులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈఏ రాజేంద్రన్ మలయాళ నాటక రంగంలో ఒక దిగ్గజం. అనేక చిత్రాలు, టెలివిజన్ సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) గ్రాడ్యుయెట్ పూర్తి చేశారు. రాజేంద్రన్ సుమారు 60 కి పైగా మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ‘నరసింహం’, ‘మీశమాధవన్’ , ‘కలియాట్టం’ వంటి సూపర్ హిల్ చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రలో నటించి మెప్పించారు. మాలీవుడ్ లో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముఖేశ్ కు స్వయానా బావ. రాజేంద్రన్ భార్య సంధ్య, కుమారుడు దివ్యదర్శన్ కూడా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!