ePaper
Saturday, June 13, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeస్పోర్ట్స్ఐసీసీ ర్యాంకింగ్స్‌.. 2వ స్థానానికి చేరుకున్న బంగ్లా ప్లేయర్

ఐసీసీ ర్యాంకింగ్స్‌.. 2వ స్థానానికి చేరుకున్న బంగ్లా ప్లేయర్

📰 Generate e-Paper Clip

ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మీరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మెహిదీ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి చేరాడు.

స్పోర్ట్స్ డెస్క్ మార్చి 18 మహాప్రభ : ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మీరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మెహిదీ తొమ్మిది స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి, వన్డే ఆల్‌రౌండర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని రెండవ స్థానానికి చేరుకున్నాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో మీరాజ్ మూడు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇక పాకిస్థాన్‌పై తన తొలి శతకం సాధించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తంజిద్ హసన్ కూడా 31 స్థానాలు ఎగబాకి 55వ స్థానానికి చేరుకోగా, లిట్టన్ దాస్ 10 స్థానాలు పైకి ఎగబాకి 82వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 28, ముస్తఫిజుర్ రెహమాన్ 47వ స్థానాలకు చేరుకున్నారు. బంగ్లాతో సిరీస్‌లో ఓడిపోయినప్పటికీ, పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. అతను వన్డే ఆల్-రౌండర్లలో 10వ స్థానంలో నిలిచాడు.టీ20ఐ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 11 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్థానానికి చేరుకున్నాడు. అతను టీ20ఐ ఆల్ రౌండర్ల జాబితాలో ఏడవ స్థానంలో ఉన్నాడు. లాకీ ఫెర్గూసన్ టీ20ఐ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 51వ స్థానానికి చేరుకోగా, డెవాన్ కాన్వే బ్యాటర్లలో 70వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఆటగాడు అభిషేక్ శర్మ టీ20ఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా టీ20ఐ బౌలింగ్ చార్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!