ePaper
Tuesday, August 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

📰 Generate e-Paper Clip

ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ గట్టి వార్నింగ్ ఇచ్చింది

ఇంటర్నెట్ డెస్క్ మార్చి18 మహాప్రభ : ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ దేశాల పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ఇరుదేశాలు పరస్పర హెచ్చరికలు సైతం చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ గట్టి వార్నింగ్ ఇచ్చింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే సమాచారం తమ వద్ద లేదని ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ సమాధానం ఇచ్చారు.

అంతర్జాతీయ మీడియాతో ఐడీఎఫ్ అధికారి డెఫ్రిన్ మాట్లాడుతూ..’ ఖమేని ఎక్కడ ఉన్నారు అనే దానిపై మాకు ప్రస్తుతం సమాచారం లేదు. కానీ మా దేశానికి ప్రమాదకరమైన వారిని నిర్మూలించడం మాత్రం ఆపం. మాకు వ్యతిరేకంగా పనిచేసేవారు మా నుంచి తప్పించుకోలేరు. వారు ఎక్కడదాక్కున్న వెంబడించి.. అంతం చేస్తాం. అయితే ఎప్పుడు, ఎక్కడ అనేది మేము ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ, మా టార్గెట్ మాత్రం మిస్ కాదు’ అని అన్నారు. మరోవైపు, దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించినట్లు వచ్చిన వార్తలను టెహ్రాన్ ఖండించింది. ఇరాన్‌ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదని, వారు ప్రజల మధ్యే ఉంటారని రష్యాలో ఇరాన్‌ రాయబారి కాజెమ్‌ జలాలీ ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!