ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతివిద్యుత్ రంగంలో ఏపీ జెన్‌కోది సరికొత్త చరిత్ర: సీఎం చంద్రబాబు

విద్యుత్ రంగంలో ఏపీ జెన్‌కోది సరికొత్త చరిత్ర: సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీ జెన్‌కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు.

అమరావతి, మార్చి 13 మహాప్రభ : ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందించారు. ఏపీ జెన్కో ఒకే రోజు 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారు. ఈ నెల 11వ తేదీన, 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం సామర్థ్యాన్ని సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రికార్డు ఒక్కరోజే సాధించడం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్‌కో ప్లాంట్ల కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి, మొత్తం జెన్‌కో టీమ్‌కు సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు.కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో జెన్‌కో సాధించే విజయాలు రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఒకే రోజు 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించటం జెన్‌కోకి చరిత్రాత్మక ఘనత అని వెల్లడించారు. ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!