భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్ 2026ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు. దానికి తాజాగా గంభీర్ రిప్లై ఇచ్చాడు.
స్పోర్ట్స్ డెస్క్ , మార్చి 9మహాప్రభ : భారత్ జట్టు టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026)ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత జట్టును, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ట్వీట్ చేశాడు.ఇక ధోని చేసిన ట్వీట్‌కు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తాజాగా రిప్లై ఇచ్చాడు. ‘మిమ్మల్ని చూడటమే నా చిరునవ్వుకు కారణం. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని ధోని ట్వీట్ కు గంభీర్ కామెట్ రాసుకొచ్చారు. టీ20 ప్రపంచ కప్ బ్లాక్ బస్టర్ ఫైనల్‌కు ధోని హాజరైన సంగతి తెలిసిందే. 2024 టీ20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధోని ట్రోఫీని మైదానంలోకి తీసుకొచ్చారు.అలానే ధోని, గంభీర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్డే ప్రపంచ కప్ 2011 టైటిల్ గెలిచిన ధోని సారథ్యంలోని టీమిండియా జట్టులో గంభీర్ కూడా సభ్యుడు. 2011 ప్రపంచ కప్ తుదిపోరులో శ్రీలంకపై గెలిచి.. భారత్ విశ్వవిజేతగా అవతరించింది. ఆ సమయంలో ధోని, గంభీర్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే వారిద్దరూ బయటక కనిపించిన సందర్భంలో ఎంతో చక్కగా ఒకరినొకరు పలకరించుకునే వారు.
