ePaper
Tuesday, August 25, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం

ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం

📰 Generate e-Paper Clip

చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జయోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్ మార్చి 03 మహాప్రభ : మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలపై పాకిస్థాన్ తొలిసారిగా స్పందించింది. చర్చలకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని పాక్ సరిహద్దుల వరకూ విస్తరించే లక్ష్యంతో రూపొందించిన విస్తృత జయోనిస్టు ఎజెండాలో ఇది భాగమని అన్నారు. ఈ కుట్రను పాక్ అర్థం చేసుకోవాలని అన్నారు.జయోనిజమ్‌తో (ఇజ్రాయెల్ జాతీయవాదం) మానవాళికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచీ నేటి వరకూ ఇస్లామిక్ ప్రపంచం ఎదుర్కొన్న ప్రతి యుద్ధం వెనుక జయోనిస్ట్ భావజాలం పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉందని అన్నారు. దాదాపు 100 ఏళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను జయోనిస్టు భావజాలమే నియంత్రిస్తోందని చెప్పారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు ఈ సిద్ధాంతానికి బందీలుగా మారాయని వ్యాఖ్యానించారు.

అఫ్గానిస్థాన్, ఇరాన్, భారత్‌‌లు కేంద్రంగా ఉన్న ఎజెండాకు పాక్‌ టార్గెట్ అవుతుందని కూడా మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముడతారని అన్నారు. చివరకు పాక్ ఒక సామంత రాజ్యంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయితే, పాకిస్థాన్ సైనిక, అణు శక్తిని ప్రపంచమంతా గుర్తించిందని కూడా పాక్ మంత్రి చెప్పారు. పాక్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అమరులైన ప్రతి ఒక్కరికీ దేశం రుణపడి ఉంటుందని మంత్రి అన్నారు. పాక్ ఎప్పటికీ శక్తిమంతంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!