ePaper
Wednesday, April 1, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్‌కు భారీ ఊరట..

📰 Generate e-Paper Clip

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసునుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 మహాప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసునుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది. శుక్రవారం ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై ది రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ వేసిన చార్జ్‌షీట్‌లో మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చింది. కవితతో పాటు 23 మంది నిందితులు తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేయనుంది.

నా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు

కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆప్‌కు చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టారు. నా జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదు. కేవలం విపక్షాలపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. ప్రజా సమస్యలను మోదీ పట్టించుకోరు. నాపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు. ఆమ్‌ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. నేను అసలుసిసలైన నిజాయితీపరుడిని. నేను కేవలం ప్రజల కోసమే పనిచేశాను. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!