ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్భారత్-పాక్ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే..

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే..

📰 Generate e-Paper Clip

గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త గందరగోళానికి తెరతీశాయి.

ఫిబ్రవరి 25 మహాప్రభ : గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త గందరగోళానికి తెరతీశాయి. తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రాణాలు కోల్పోయి ఉండేవారిని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ట్రంప్ చెప్పాలనుకున్నది అది కాదు (Trump on India Pakistan tensions).అధికారంలోకి వచ్చిన పది నెలల్లో తాను ఎనిమిది యుద్ధాలను ఆపానని అమెరికా కాంగ్రెస్ ‘స్టేట్ ఆఫ్ యూనియన్’ ప్రసంగంలో ట్రంప్ చెప్పారు. ఆ సందర్భంగా భారత్-పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి మాట్లాడారు. ‘పాకిస్థాన్ ప్రధాని చెప్పారు.. నేను లేకపోతే 35 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని’ అని చెప్పాలనుకున్నారు. అయితే ఆయన మాటల మధ్య విరామం లేకపోవడంతో ‘నేను లేకపోతే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పోయేవారని 35 మిలియన్ల మంది చెప్పారు’ అనే అర్థం ధ్వనించింది (Pakistan PM).ట్రంప్ మాటల నేపథ్యంలో చాలా గందరగోళం నెలకొంది (35 million deaths claim). కాగా, ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని ఆపాలని ప్రధాని షరీఫ్ వేడుకోవడంపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది. పాక్ పరువు తీసేలా ట్రంప్ మాట్లాడుతున్నా ఒక్కసారి కూడా ప్రధాని ఎందుకు స్పందించడం లేదని చాలా మంది అడుగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!