ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంనేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

📰 Generate e-Paper Clip

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ 24 గంటలైనా గడవకముందే తన మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ మోహ్సిన్‌ నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదంటూ యూ టర్న్ తీసుకున్నాడు.

స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 17 మహాప్రభ : పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌,రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) 24 గంటలైనా గడవకముందే తన మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (పీసీబీ) అధ్యక్షుడు, ఏసీసీ ఛైర్మన్ నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదంటూ యూ టర్న్ తీసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనే పదాలను పాకిస్థాన్‌ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్నానని, నఖ్వీని ఉద్దేశించి మాత్రం కాదని అక్తర్ స్పష్టం చేశాడు.అసమర్థుడు, నిరక్ష్యరాస్యుడు అనే పదాలను తాను మోహ్సిన్‌ నఖ్వీని ఉద్దేశించి అనలేదని, అసమర్థత అనే పదాన్ని విస్తృత కోణంలో వాడానని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ను నడుపుతున్న అగ్రశ్రేణిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని, కానీ తన మాటలను ఆ ఛానల్‌ వక్రీకరించిందని అక్తర్ తెలిపాడు. నిజానికి అదే కార్యక్రమంలో నఖ్వీ గురించి తప్పుగా మాట్లాడకూడదని తానే చెప్పాననని వెల్లడించాడు. నఖ్వీ మంచి వ్యక్తి అని, పాకిస్థాన్‌ క్రికెట్‌కు సాయం చేయాలనుకుంటున్నాడని, కానీ ఆయనకు సరైన సలహాలు ఇచ్చేవారు లేరంటూ షోయబ్‌ అక్తర్‌ వివరణ ఇచ్చాడు.

అక్తర్ తొలుత చేసిన వ్యాఖ్యలు ఇవే:

అంతకుముందు భారతీయ ఛానల్‌తో షోయబ్‌ అక్తర్(Shoaib Akhtar) మాట్లాడుతూ.. నఖ్వీ అసమర్థుడని, పాక్‌ క్రికెట్‌ను నడపలేడని అన్నాడు. ‘మీరు నన్ను ఛానల్‌ ఛైర్మన్‌ను చేస్తే.. నాకు దీన్ని నడపడం ఎలాగో తెలుస్తుందా? , అలాగే ఏమీ తెలియని వ్యక్తి ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డ్‌ ఛైర్మన్‌గా ఉన్నాడు. ప్రపంచంలోకెల్లా పెద్ద నేరం ఏంటంటే అసమర్థుడైన, నిరక్షరాస్యుడైన వ్యక్తిని ఉన్నత పదవుల్లో నియమించడమేనని అక్తర్ అన్నాడు. దీంతో పాకిస్థాన్‌లో అక్తర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో 24 గంటలు గడవక ముందే ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ యూ టర్న్ తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌2026లో (T20 World Cup) భాగంగా కొలంబోలోని ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!