ePaper
Saturday, March 28, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయంటీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన ఐర్లాండ్ బ్యాటర్లు.. ఒమన్ టార్గెట్ 236

టీ20 ప్రపంచ కప్ 2026: చెలరేగిన ఐర్లాండ్ బ్యాటర్లు.. ఒమన్ టార్గెట్ 236

📰 Generate e-Paper Clip

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు సాధించింది.

ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 14 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా ఐర్లాండ్-ఒమన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ఒమన్‌కు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐర్లాండ్ కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ (94*; 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. గారెత్‌ డెలానీ (56; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీతో అలరించాడు. లోర్కాన్‌ టక్కర్‌, గారెత్‌ డెలానీ ఐదో వికెట్‌కు 56 బంతుల్లో 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో జార్జ్ డాక్రెల్ కేవలం 9 బంతుల్లో 5 సిక్స్‌ల సాయంతో 35 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు బాదాడు. లోరాన్‌ టక్కర్‌తో కలిసి ఆరో వికెట్‌కు కేవలం 19 బంతుల్లోనే 70 పరుగులు జత చేశాడు. ఒమన్ బౌలర్లలో షకీల్‌ అహ్మద్‌ నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. నదీమ్‌ ఖాన్‌, షా ఫైసల్‌ తలో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!