ePaper
Friday, April 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeజాతియంఅతీతశక్తులంటూ మోసం.. మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

అతీతశక్తులంటూ మోసం.. మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

📰 Generate e-Paper Clip

అతీతశక్తుల పేరుతో వివాహితను మోసం చేసి రూ. రెండు కోట్లతో ఉడాయించిన కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు నిందితుడు.

హైదరాబాద్ ఏప్రిల్ 10 (మహాప్రభ) : అతీతశక్తులతో సమస్యలు పరిస్కరిస్తానంటూ వివాహితను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతీత శక్తులు ఉన్నట్లు వివాహితకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద నుంచి దాదాపు రెండు కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఆస్తులు తీసుకుని ఉడాయించాడు నిందితుడు. 2022లో పరారైన నిందితుడు.. దాదాపు మూడేళ్ల తర్వాత పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాను ధనవంతుడినని, ఓ కంపెనీ యజమానిని అంటూ వివాహితకు వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు నిందితుడు. ఆమె కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందుల గురించి వివరాలు తెలుసుకుని తనకు అపారశక్తులు ఉన్నాయంటూ మాయమాటలతో నమ్మించాడు. హనీ ట్రాప్ వేసి పూజలు, మంత్రాల పేరుతో వివాహిత నుంచి బంగారు ఆభరణాలు, నగదు, ఇతర ఆస్తులను తీసుకున్నాడు. దాదాపు రెండు కోట్లు విలువ చేసే అస్తులను తీసుకుని 2022లో పరారయ్యాడు నిందితుడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన మహిళ.. భర్త మద్దతుతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. గత మూడేళ్లుగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా నిందితుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. తనకు అతీత శక్తులు ఉన్నాయని, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉందని వీడియోలు, పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎంతో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!