మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఉన్న ప్రత్యేక…
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 మహాప్రభ : మైనర్ బాలురపై అత్యాచారాలకు పాల్పడి, ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ జంటకు ఉత్తరప్రదేశ్లోని బాందాలో ఉన్న ప్రత్యేక కోర్టు శుక్రవారం మరణ శిక్ష విధించింది. నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీరుగా పనిచేసిన రామ్భావన్, అతడి భార్య దుర్గావతికి ఈ శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది. 2010-2020 మధ్య పలు జిల్లాల్లో 33 మంది బాలురపై వీరు అత్యాచారం చేసినట్టు రుజువయింది. బాధితుల్లో మూడేళ్ల బాబు కూడా ఉన్నాడు.
