ePaper
Wednesday, April 8, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Home14 వరకు వర్షాలు కురిసే అవకాశం14 వరకు వర్షాలు కురిసే అవకాశం

14 వరకు వర్షాలు కురిసే అవకాశం

📰 Generate e-Paper Clip

పశ్చిమ బెంగాల్‌ నుంచి మన్నార్‌ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది.

చెన్నై ఏప్రిల్ 8 (మహాప్రభ) : పశ్చిమ బెంగాల్‌ నుంచి మన్నార్‌ జలసంధి వరకు ఒడిశా దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. ఈ ప్రభావంతో, బుధవారం నుంచి ఈ నెల 14వ తేది వరకు పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, డెల్టా జిల్లాలు, కారైక్కాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. మిగిలిన తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది.

బుధ, గురువారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 2-3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. అధిక ఉష్ణోగ్రత 35-36 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 26-27 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!