ePaper
Monday, March 30, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఇంటర్నేషనల్శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101 మంది గల్లంతు

శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి.. 101 మంది గల్లంతు

📰 Generate e-Paper Clip

ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు.

కొలంబో మార్చి 4 మహాప్రభ : ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి (Submarine) దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. వీరిలో 32 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నాయి.

కాగా, 180 మందితో ఉన్న ఐఆర్ఐఎస్ దేనా నౌక మునిగిపోతున్నట్టు తమకు సమాచారం రావడంతో వెంటనే సహాయక సిబ్బందిని రంగంలోకి దించినట్టు విదేశాంగ మంత్రి విజిత హెరాథ్ తెలిపారు. నౌక వేగంగా మునిగిపోతున్న సమయంలో 32 మందిని సిబ్బంది రక్షించారు. గాలె నగర సమీపంలో దక్షిణ తీరానికి కొద్ది దూరంలో ఈ దాడి జరిగింది. క్షతగాత్రులను గాలేలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సబ్‌మెరైన్‌తో దాడి జరిపిందెవరనేది వెంటనే వెల్లడి కాలేదు. ఐఆర్ఐఎస్ దేనా నౌక విశాఖపట్నంలో జరిగిన నావికా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!